కూటమిలో కుంపటి.. చంద్రబాబు, పవన్ సమక్షంలో బయటపడ్డ విబేధాలు సీట్ల సర్దుబాటు జరిగింది. అంతా బాగానే ఉందనుకున్న సమయంలోనే.. అంతర్గతంగా ఇంకేదో జరిగిపోతోంది.. ఈ క్రమంలోనే పొత్తు.. ఉందా లేదా..? ఉంటే ఇలా జరుగుతుందేంటి..? ఎన్నికల వేళ ఈ గొడవలేంటి..? ఇలా తెలుగుదేశం, జనసేన, బీజేపీ క్యాడర్‌లో ఇప్పుడు సరికొత్త సందేహాలు వెంటాడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ఏపీ కూటమిలో కుంపట్లు మొదలవ్వడం రాజకీయాల్లో సంచలనంగా మారింది..