దేవాదుల ప్రాజెక్ట్ పనులకు డెడ్‌లైన్ ఫిక్స్..! కాలేశ్వరం ప్రాజెక్టును రాజకీయ వివాదాలు చుట్టుముట్టి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పై దృష్టి పెట్టింది. మూడో దశ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేసి ఉత్తర తెలంగాణ జిల్లాలను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా కసరత్తు మొదలు పెట్టింది. అందులో భాగంగానే నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రులు సీతక్క, పొంగులేటి నీటిపారు దలశాఖ నిపుణులు, అధికారుల బృందం దేవాదుల ఇంటెక్వెల్ను పరిశీలించి అక్కడే ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.