స్కూల్‌కి తాళాలు వేసిన అడవి బిడ్డలు.. అడవి బిడ్డలు అంటే అంత అలుసా, మేము చదువుకోలేదు కనీసం మా పిల్లలను అయిన చదివించాలి అనుకుంటే మాపై మరి ఎంత నిర్లక్ష్యమా, టీచర్లు లేని పాఠశాల మాకు అవసరం లేదు అంటూ ప్రభుత్వ పాఠశాలకు తాళం వేశారు తల్లిదండ్రులు. పాఠశాలలో వెంటనే ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ ఘటన అశ్వాపురం మండలం కురువపల్లి కొత్తూరులో జరిగింది.