యముడికే ధమ్కీ.. రైలు వేగంలో మృత్యుగండం దూసుకొచ్చినా...

మహబూబాబాద్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తి ఆగి ఉన్న ట్రైన్ కింద దూరి పట్టాలు దాటేందుకు ప్రయత్నించగా ఆ ట్రైన్ ఒక్కసారిగా కదిలింది. కానీ ఆ వ్యక్తి మాత్రం ఊహించని రీతిలో ప్రాణాలతో బయటపడ్డాడు ఈ విచిత్ర సంఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో జరిగింది.. రైల్వే స్టేషన్ సమీపంలో గూడ్స్ రైలు ఆగి ఉంది. ఈ క్రమంలో ఎప్పటిలాగే రైలు పట్టాల కింద నుండి దూరి అవతల వైపు వెళ్లడానికి ఓ వ్యక్తి ప్రయత్నం చేశాడు. కానీ అతను రైలు కింద నుండి దూరుతున్న క్రమంలో అకస్మాత్తుగా రైలు కదిలింది.. ఈ క్రమంలో ఎటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితిలో ఆ వ్యక్తి వెంటనే రైలు కింద పట్టాల మీద పడుకున్నాడు.