ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కవితను హాజరుపరిచింది సీబీఐ. ఆమెను జ్యుడీషియల్ కస్టడీకి పంపాలని ఢిల్లీ స్పెషల్ కోర్టును సీబీఐ కోరింది. ఈ నెల 23 వరకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ న్యాయమూర్తి ఆదేశించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కవితనే కీలక సూత్రధారి, పాత్రధారి అని ఆరోపిస్తోంది సీబీఐ. లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆమ్ ఆద్మీ పార్టీకి వంద కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ నుంచి డబ్బు సమకూర్చడం.. ఇవన్నీ కవిత కనుసన్నల్లోనే జరిగాయంటోంది.