శ్రీశైలంలో ఘనంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు.. పెరిగిన భక్తుల రద్దీ

స్వామి అమ్మవార్లు రావణ వాహనంపై ఆలయ ప్రదక్షిణ సాగుతుండగా భక్తులు భక్తి శ్రద్ధలతో రావణ వాహనంలో ఉన్న స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం కావడంతో శ్రీశైలం ఆలయం ఉత్తర ద్వారం దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 6 గంటల నుంచి స్వామి అమ్మవార్లను ఉత్తర ద్వారం నుంచి భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.