ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేస్తూ దొంగలు రెచ్చిపోతున్నారు. తాజాగా ఓ మహిళకు మాయమాటలు చెప్పి ఆమెకు మత్తుమందు ఇచ్చి మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు చైన్ ఎత్తుకెళ్లిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో లక్ష్మీపేట లో నివాసం ఉంటున్నా ఉమాదేవి ఇంటికి ఇద్దరు వ్యక్తులు ఇంటి ముందు ఉన్న టైల్స్ ను ఓ లిక్విడ్ తో శుభ్రం చేస్తామని నమ్మబాలికారు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారు కూడా ఇలా క్లిన్ చేస్తామని ఉమాదేవిని నమ్మించి, తెలుపు రంగులో ఉన్న ఓ పౌడర్ ను ఉమాదేవి చేతికి అందించారు. అది చేతిలోకి తీసుకున్న వెంటనే ఉమాదేవి మత్తులోకి జరిపోయింది.