కోల్‌కతా నైట్ రైడర్స్ సహ-యజమాని, షారుఖ్ ఖాన్ విశాఖలో సందడి చేశారు. ఈరోజు విశాఖలో DC vs KKR ఐపిఎల్ T20 మ్యాచ్ నేపథ్యంలో తన జట్టు KKR ప్రచారంతో పాటు తన టీంకు మద్దతు ఇవ్వడానికి ముంబై నుంచి ప్రత్యేక విమానంలో షారుఖ్ విశాఖ చేరుకున్నారు. దీంతో విశాఖ ఎయిర్ పోర్ట్లో షారుఖ్ కు ఘన స్వాగతం పలికారు అభిమానులు. చాలా గోప్యంగా ఉంచినప్పటికి షారుఖ్ రాక తెలుసుకున్న అభిమానులు పెద్ద ఎత్తున ఎయిర్ పోర్ట్ వచ్చేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పోలీస్ అధికారులు వారిని నిలువరించారు.