మంచిర్యాల జిల్లాలో డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన 27 మంది మందు బాబులకు వారం రోజులపాటు మాతా శిశు ఆసుపత్రిని శుభ్రం చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు ఫస్ట్ అడిషనల్ సివిల్ జడ్జి ఉపనిషద్విని. కోర్టు ఆదేశాల మేరకు వారం రోజుల పాటు ఆస్పత్రిని శుభ్రం చేసేందుకు మందుబాబులను తరలించారు ట్రాఫిక్ పోలీసులు.