"మున్సిపాలిటీలో ఉన్న కుక్కలన్నీ మా ఇంటి ముందు చేరాయి. ప్రతి వీధి నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఇంకొక్కసారి కుక్క కనిపిస్తే కమిషనర్ కనిపించడు.." పబ్లిక్‌గా ఈ మాటలు అన్నదీ ఎవరో కాదు. సాక్షాత్తు స్థానిక ఎమ్మెల్యే. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు ఎమ్మెల్యే కే ఈ పరిస్థితి వచ్చిందంటే సామాన్య జనానికి కుక్కల బాధ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవాలి..!