జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి అదే పని చేస్తూ దొరికిపోయిన వైనం..

జైలు నుంచి బయటకు వచ్చి తిరిగి అదే పని చేస్తూ దొరికిపోయిన వైనం.. మేడ్చల్ జిల్లా దుండిగల్ పి.యస్ పరిధిలో పెద్దమొత్తంలో గంజాయి పట్టివేత. గండిమైసమ్మ చౌరస్తాలో దుండిగల్ పోలీసులు మేడ్చల్ SOT పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఓ స్వీట్ బాక్స్‎లో అక్రమ రవాణా చేస్తున్న సుమారు లక్ష రూపాయల విలువ గల ఒక లీటరు హాషిష్ ఆయిల్ (గంజాయి ఆయిల్ )ను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. 71 సంవత్సరాల వృద్దుడు రవాణా చేస్తున్నట్లు తెలిపారు. ఇతనిపై గతంలో కూడా కేసులు ఉన్నట్లు తెలిపారు. గంజాయి నూనె తరలిస్తున్న పాత నేరస్థుడిని అరెస్టు చేసి రిమాండ్‎కు తరలించారు. పోలీసుల విచారణలో నిందితుడు కుర్రు శంకర్ రావు గా గుర్తించారు. నిందితుడు అనకాపల్లికి చెందిన వాడిగా తెలిపారు.