భక్తులను ఆకట్టుకుంటున్న కదంబ పుష్పాల గణపతి.. చూడడానికి రెండు కళ్లు చాలవు.. ఎక్కడంటే!

వినాయక చవితి వచ్చిందంటే చాలు శ్రీకాకుళం జిల్లాలో అందరి దృష్టి కవిటి మండలంలోని బోరువంక గ్రామంపైనే పడుతుంది. ఎందుకంటే ఆ గ్రామంలోని ఉద్దానం యూత్ క్లబ్ నిర్వాహకులు ప్రతిసారీ వినూత్న రీతిలో గణపయ్య విగ్రహాలను ప్రతిష్టిస్తూ భక్తులను ఆకట్టుకుంటుంటారు. ఈ సారి కూడా అదే విధంగా కదంబ పుష్పాలతో ప్రత్యేక గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించి భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్నారు.