ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో తాగిన మత్తులో ఉన్న పాములను పట్టే వ్యక్తి.. పాముల పెట్టె నుంచి ఒక పామును బయటకు తీసి వీధిలో నానా హంగామా సృష్టించాడు. ఆ పాములవాడు దుకాణదారుల నుంచి డబ్బు డిమాండ్ చేశాడు.. మద్యం మత్తులో ఉన్న అతని డిమాండ్ ని దుకాణదారులు లెక్కచేయలేదు. దీంతో ఆ పాములవాడు పామును చూపించి అందరినీ భయపెట్టాడు. అదే సమయంలో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను కూడా పాముతో వారిని భయపెట్టాడు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.