ఊపిరి బిగపట్టి బతుకుతున్న జనం.. పొంచి ఉన్న ముప్పు!

కరీంనగర్ మొత్తంగా మేఘాల రూపంలో అలుముకుంది. ఈ వాతావరణం చూసి అదేదో హిల్ స్టేషన్ అనుకుంటున్నారేమో.. కానే కాదు.. ఇది కరీంనగర్ జిల్లా కేంద్రం... ఈ పొగ ఏదో శీతల ప్రదేశంలో కనిపించే పొగమంచు కాదు. ప్రాణాలు తీసే విషవాయువులు ఉన్న ప్రమాదకరమైన ధూమం. కరీంనగర్ ని ఆనుకుని ఉండే డంపింగ్ యార్డ్ నుండి గత రెండు మూడు రోజులుగా వస్తున్న ఈ పొగ నగరాన్ని కమ్మేసింది. కరీంనగర్ - పెద్దపల్లి బైపాస్ రోడ్డుతో పాటుగా, హైదరబాద్ కరీంనగర్ రాజీవ్ రహాదారిపై కూడా సుమారు ఐదు కిలోమీటర్ల వరకు ఈ పొగ వ్యాపిస్తోంది.