కేరళ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమరాగ్ని యాత్ర ముగింపు సమావేశంలో జాతీయ గీతానికి అవమానం జరిగింది. తిరువనంతపురం డీసీసీ అధ్యక్షుడు పాలోడే రవి జాతీయ గీతాన్ని తప్పుగా ఆలపించారు. ముగింపు కార్యక్రమం అనంతరం జాతీయ గీతం ఆలపించేందుకు వచ్చిన పాలోడు రవికి మొదటి లైన్ తప్పింది. వెంటనే పొరపాటున గుర్తించిన ఎమ్మెల్యే టి.సిద్ధిక్ మైక్ లాక్కొని 'సీడీ అక్కడ పెడతాను' అంటూ మైక్ నుంచి రవిని పంచించేశారు. చివరగా, ఒక మహిళా నాయకురాలు వచ్చి జాతీయ గీతాన్ని అలపించి సమావేశాన్ని ముగించారు.