వేదం అభ్యసిస్తున్న కొంతమంది స్టూడెంట్స్ చూడడానికి, వినడానికి కొత్త్తగా ఉండే విధంగా సరికొత్త కబడ్డీ లీగ్ మ్యాచ్‌ని నిర్వహించారు. ధోతీ-కుర్తాలో ప్లేయర్స్, సంస్కృతంలో వ్యాఖ్యానం; ఇలాంటి కబడ్డీని చూశారా.. ఇలాంటి కబడ్డీ పోటీలు ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలోని సంపూర్ణానంద సంస్కృత విశ్వవిద్యాలయంలో నిర్వహించారు. ఈ కబడ్డీ మ్యాచ్ లో పాల్గొన్న స్టూడెంట్స్ వేదం అభ్యసిస్తారు. వేద విద్యార్థులు ధోతీ, కుర్తాలను ధరించి పవిత్ర జంధ్యంతో కబడ్డీ ఆడారు. అయితే ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే పోటీలు జరుగుతున్న సమయంలో కామెంటరీ కూడా సంస్కృతంలోనే జరిగింది.