అల్వాల్ పరిధిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బైక్‌పై ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ వెళుతున్న యువకుడిని ఆపిన వృద్ధుడు మృత్యువాత పడ్డాడు. రోడ్డుపై బైక్‌పై రాష్ డ్రైవింగ్ చేస్తున్న యువకుడిని ఓ వృద్ధుడు ఆపడంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో యువకుడు వృద్ధుడిపై దాడి చేయడంతో.. ఆయన మరణించాడు. సదరు యువకుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.