రీల్స్ పిచ్చితో యువత ఏం చేస్తున్నారో వారికే తెలియకుండా పోయింది. కొందరు తమ ప్రాణాలను పణంగా పెట్టి ప్రమాదకర స్టంట్స్ చేస్తుంటే, మరికొందరు ఎదుటి వారిని ప్రమాదంలోకి నెట్టేస్తు్నారు. ఇక కొందరు అవతలి వ్యక్తుల మనోభావాలతో ఆడుకోవాలని చూస్తున్నారు. అలాంటి పని చేసిన ఓ వ్యక్తికి హైదరాబాద్ పోలీసులు తగిన గుణపాఠం చెప్పారు. నగరంలోని ఔటర్ రింగ్ రోడ్డుపై మనీ హంటింగ్ ఛాలెంజ్ పేరుతో రీల్స్ చేసిన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు.