ఘోర రోడ్డుప్రమాదంలో 21 మంది యువ అథ్లెట్లు మరణించిన విషాద సంఘటన నైజీరియాలో తీవ్ర కలకలం రేపుతోంది. నైజీరియాలో మే 31 శనివారం జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 21 మంది యువ అథ్లెట్లు మృతి చెందారు. నైజీరియాలోని ఓగున్ రాష్ట్రం నిర్వహించిన 22వ జాతీయ క్రీడల్లో పాల్గొన్న తర్వాత ఉత్తర నైజీరియాలోని కానోకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 'ఇది జాతీయ విషాదం' అని నైజీరియా క్రీడా మంత్రిత్వ శాఖ మీడియాకు తెలిపింది. డ్రైవర్ అలసట, అతివేగం కారణంగానే ప్రమాదం జరిగి ఉండవచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.