Andhra Pradesh: అరసవల్లిలో అద్భుత దృశ్యం.. బంగారుమయంగా సూర్యనారాయణుడు.. రెండేళ్ల తరువాత..

ప్రత్యక్ష దైవం అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి క్షేత్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. ఆలయంలోని స్వామి వారి మూలవిరాట్టును ఆ సూర్యకిరణాలు నేరుగా తాకాయి. లేలేత సూర్య కిరణాల స్పర్శతో స్వామి వారి మూలవిరాట్ దేదీప్యమానంగా వెలుగొందుతూ భక్తులకు దర్శనిమిచ్చింది.