ప్రకృతి ప్రకోపానికి జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ గురయ్యాయి. అక్కడ కురుస్తున్న కుండపోత వర్షాలకు చిగురుటాకులా వణికిపోతున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో జాతీయ రహదారి కోతకు గురైంది. ఇళ్లు, వాహనాలు వరద నీటిలో కొట్టుకుపోయాయి. అటు జమ్మూలో గత 12 గంటల్లో 30 సెం.మీ వర్షపాతం నమోదైనట్లు తెలిసింది. రోడ్లపై నీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో స్కూళ్లు, కాలేజీలకు బుధవారం సెలవు ప్రకటించారు.