మరోసారి ఔదార్యాన్ని చాటుకున్న ప్రధాని నరేంద్ర మోదీ మహబూబ్ నగర్ నియోజకవర్గం పరిధిలో జరిగిన సభలో పాల్గొన్న మోదీ.. మరోసారి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. మోదీ ప్రసంగిస్తుండగా, ఒక్కసారిగా ఆయన చూపు సభకు హాజరైన దివ్యాంగులపై పడింది. వెంటనే స్పందించని మోదీ, వారిని జనం మధ్యలో నుంచి సురక్షిత ప్రాంతానికి తీసుకు రమ్మని సూచించారు. దీంతో ఆ ఇద్దరు దివ్యాంగు మహిళలను వాలంటీర్లు సభ ప్రాంగణంలో తీసుకువచ్చారు. ఈ సందర్భంగా తనపై ప్రేమతో వ్యయప్రయాసలకు ఒడ్చి బహిరంగ సభకు హాజరైనందుకు ఆ దివ్యాంగులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోదీ.