నాటకీయ పరిణామాల మధ్య మాజీ ఎంపీ, వైసీపీ నేత నందిగామ సురేశ్‌ను ఏపీ పోలీసులు తెలంగాణలో అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్‌లోని మియాపూర్ గెస్ట్‌హౌజ్‌లో ఉన్నారన్న సమాచారంతో ఏపీ పోలీసులు అక్కడికి వెళ్లారు. పక్కా సమాచారంతో అక్కడ ఆయన్ను అరెస్ట్ చేశారు. హైకోర్టు తీర్పు అనంతరం మంగళగిరి తరలించారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న వైసీపీ నేతలంతా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, తలశిల రఘురామ్, నందిగం సురేష్ తదితరుల కోసం గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల పోలీసులతో కలిపి 12 బృందాలను ఏర్పాటుచేశారు. దాడి జరిగిన రోజు వైసీపీ కార్యాలయం వద్ద ఉన్న సిసి కెమెరా విజువల్స్ ఇవ్వాలంటూ తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయానికి మంగళగిరి పోలీసులు నోటీసులు ఇచ్చారు.