తెలంగాణలో 17 ఎంపీ స్థానాల్లో టికెట్ల కోసం అధికార కాంగ్రెస్ పార్టీకి 306 ఆశావహులు అప్లయ్ చేసుకున్నారు. సికింద్రాబాద్ లోక్‌సభ టికెట్ కోసం వేణుగోపాల స్వామి, అనీల్ కుమార్ యాదవ్, రోహిణ్ రెడ్డి సహా కాంగ్రెస్ అధికార ప్రతినిధి సామ రామ్ మోహన్ రెడ్డి దరాఖస్తులు దాఖలు చేశారు. సొంత గూటిలోనే ఇంత మంది పోటీ పడుతున్నారు. ఐతే కాంగ్రెస్ హైకమాండ్ మాత్రం ..కాపు ఈక్వెషన్‌తో సరైన క్యాండిడేట్‌ను సికింద్రాబాద్ నుంచి బరిలోకి దింపాలని చూస్తుందనేద పొలిటికల్ సర్కిల్స్ ఓ టాక్ చక్కర్లు కొడుతోంది.