ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి.. కడియం శ్రీహరి తీరుపై బీఆర్ఎస్ నేతల ఆగ్రహం కాంగ్రెస్‌లోకి వెళ్తున్న కడియం శ్రీహరి బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఆ పార్టీ నేతలు. విలువల గురించి మాట్లాడే కడియం విలువలంటే ఇవేనా? అని ప్రశ్నిస్తున్నారు. కడియంకు కేసీఆర్ ఎన్నో అవకాశాలు ఇస్తే.. పార్టీపై తప్పుడు ప్రచారం సరికాదని అన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి.. బీసీలు, దళితులను రాజకీయంగా ఎదగనీయకుండా కడియం శ్రీహరి అడ్డుకున్నారని ఆరోపించారు మరో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్. కడియంకు కేసీఆర్ ఇచ్చినన్ని అవకాశాలు మరెవ్వరికి ఇవ్వలేదని పేర్కొన్నారు.