పసుపు ప్యాకెట్లలో గంజాయి హైదరాబాద్‌లో గంజాయి స్మగ్లింగ్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గంజాయి ఎక్కడ పట్టుబడ్డా.. దాని మూలాలు ధూల్‌పేట్‌కు కనెక్ట్ అవుతుండడంతో అక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టారు. గతంలో గుడుంబాకు అడ్డాగా ఉన్న ధూల్‌పేట్‌ను సమూలంగా ప్రక్షాళించిన పోలీసులు.. ఇప్పుడు.. గంజాయి నిర్మూలన కోసం.. ఆపరేషన్ ధూల్‌పేట్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.