భార్యను వేధిస్తున్నాడని దాడి.. తీరా అసలు నిజం తెలిశాక..!

తన భార్యను వేధిస్తున్నాడని ఓ వ్యక్తి వెతుక్కుంటూ వచ్చి ఇంకో వ్యక్తిపై దాడి చేశాడు. ఎవరికైనా ఇలాంటి పరిస్థితిలో అలా అనిపించడం సహజం. పైగా సొంత వారిని వేధింపులకు గురి చేశారని తెలిస్తే కొన్ని సార్లు చంపడానికి కూడా వెనకాడరు కొందరు. ఇక్కడ కూడా ఈ వ్యక్తి అదే ఆవేశంలో తన భార్యను వేధిస్తున్నాడని వెతుక్కుంటూ వెళ్లి మరీ దాడి చేశారు. కానీ, అక్కడ అవతలి వ్యక్తి అసలైన నిందితుడు కాదు.. ఒకరిని అనుకుని మరొకరిపై దాడి చేశాడు. ఈ సంఘటన హైదరాబాద్ నగరం కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.