మధ్యప్రదేశ్లోని సాగర్ లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. భీకర గాలుల ధాటికి ఓ ఇంటి పైకప్పు లేచిపోయింది. అయితే పైకప్పు ఎగిరిపోవడంతో దానిని పట్టుకుని ఉన్న చిన్న పిల్లలు కూడా పైకి లేచి పడిపోయారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. అయితే పిల్లలు క్షేమంగానే ఉన్నట్లు తెలుస్తోంది.