దీనంగా రోడ్డుపై ముగ్గురు పిల్లల తల్లి.. చలించిపోయిన మంత్రి కోమటిరెడ్డి

ఊరు గాని ఊరు, హైదరాబాద్‌లో తెలిసిన మనిషి లేడు. కానీ పల్లెటూరు నుంచి నమ్మకం పెట్టుకొని ముగ్గురు చిన్నపిల్లలతో బస్సెక్కింది ఓ భర్త చనిపోయిన అభాగ్యురాలు. కనిపించిన వారిని ఓ అడ్రస్‌కు చేరింది. రానైతే వచ్చింది కానీ.. తెలిసిన మనిషి లేడు. ఆ మనిషిని జీవితంలో ఒక్కసారి కలిసిందీ లేదు. అతడిని కలిపించమని ఎవరినైనా.. అడుగుదామంటే ఏమంటారోననే భయం. ఆమె గురించి తెలుసుకున్న తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.