విజయవాడలో భారీ వర్షం, నదులను తలపిస్తున్న రహదారులు

ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రి పై కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. కొండపై నుండి భారీ కొండ రాళ్లు జారి కింద పడ్డాయి. అయితే వర్షాల నేపధ్యంలో అప్రమత్తమైన ఆలయ సిబ్బంది ముందుగా ఘాట్ రోడ్ ను మూసి వేసింది. దీంతో పెను ప్రమాదం తప్పింది. డోనార్స్ లంజ్ తో పాటు ప్రోటోకాల్ రూమ్ పై కొండ చరియలు విరిగి పడ్డాయి. కొండపైన ఉన్న సమాచార కేంద్రం కార్యాలయం పూర్తిగా ధ్వంసం అయింది. ఈ నేపథ్యంలో గుడిపైకి భక్తులు వెళ్లకుండా సిబ్బంది రాకపోకల్ని నిలిపివేశారు.