మూడు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం(సెప్టెంబర్ 3) ఉదయం బ్రూనై దారుస్సలాం, సింగపూర్‌లకు బయలుదేరి వెళ్లారు. సుల్తాన్ హాజీ హసనాల్ బోల్కియా ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ బ్రూనై దారుస్సలాంలో పర్యటిస్తున్నారు. ప్రధాని మోదీ బ్రూనై పర్యటన భారత ప్రధాని చేసే తొలి ద్వైపాక్షిక పర్యటన.