లేకపోతే చీల్చి చెండాడే వాళ్లం.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

లేకపోతే చీల్చి చెండాడే వాళ్లం.. హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు మాజీ మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలు కర్నాటకలో చేతులెత్తేశారు.. తెలంగాణలోనూ గ్యారంటీలను ఎత్తేస్తారు.. అంటూ పేర్కొన్నారు. గ్యారెంటీల అమలు విషయంలో.. ఇంకా 100 రోజులు కాలేదని ఆగుతున్నామని.. లేకపోతే కాంగ్రెస్‌ను చీల్చి చెండాడే వాళ్లమంటూ హరీష్‌ రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోజులైతే బీఆర్ఎస్ నేతలు ఇంట్లో కూర్చున్నా.. రండి రండి అని ప్రజలే బయటకు తీసుకువస్తారంటూ పేర్కొన్నారు..