శిఖరాగ్రాన స్వర్ణ కళాశాల ప్రతిష్ట శుభవేళ వేద ఘోష నింగిని తాకింది. భక్త నీరాజనం నేలన మురిసింది. ఆకాశం నుంచి విరుల వృష్టి కురుస్తుండగా ఉరుకుంద ఈరన్న స్వామి మహా కుంభాభిషేక మహోత్సవం సంబరంగా సాగింది. కర్నూలు జిల్లా కౌతాళం మండలం ఉరుకుంద ఈరన్న స్వామి కుంభాభిషేక మహోత్సవానికి వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాదిమంది భక్త జనం తరలివచ్చారు.