వాళ్లది ఫ్లాప్ సినిమా.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..

లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో భారతీయ జనతా పార్టీ స్పీడును పెంచింది. మూడో సారి అధికారమే లక్ష్యంగా ప్రధాని మోదీ రంగంలోకి దిగి.. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తాజాగా.. ప్రధాని మోదీ ఉత్తరప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు. శనివారం ఢిల్లీ రోడ్డులోని రెయిన్‌బో పబ్లిక్ స్కూల్ సమీపంలోని ఓల్డ్ రాధా స్వామి సత్సంగ్ భవన్‌లో సహరాన్‌పూర్‌లోని బీజేపీ అభ్యర్థి రాఘవ్ లఖన్‌పాల్, ఆ పార్టీ కైరానా అభ్యర్థి ప్రదీప్ చౌదరికి మద్దతుగా సహరాన్‌పూర్‌లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు