ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో .. వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్రతో దూసుకెళ్తున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఆదివారంతో పదో రోజుకు చేరుకుంది. ఇవాళ సీఎం జగన్ యాత్ర ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశించనుంది.