రెండు తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ వినాయకుడి గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదేమో... అత్యంత్య వైభవంగా ఇక్కడ చవితి వేడుకలను నిర్వహిస్తారు. ప్రతి ఏటా గణనాధుడి ఎత్తు పెంచుతూ వచ్చిన భాగ్యనగర్ ఉత్సవ కమిటీ రెండేళ్ల క్రితం నిర్ణయం తీసుకొని క్రమంగా ఎత్తు తగ్గిస్తూ వస్తోంది. అయితే ఖైరతాబాద్ వినాయకుడిని ఆదర్శంగా తీసుకున్న ఏపీ వాసులు మాత్రం అలంకరణ కోసం వినియోగించే కరెన్సీ నోట్లను పెంచుకుంటూ పోతున్నారు. ఈ ఏడాది ఏకంగా 2.3 కోట్ల రూపాయల నోట్లతో ప్రత్యేక అలంకరణ చేసి ఔరా అనుకునేలా చేశారు.