శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారికి వార్షిక కుంభోత్సవం ఘనంగా నిర్వహించారు. చైత్ర మాసంలో పౌర్ణమి తరువాత వచ్చిన శుక్రవారం సందర్భంగా భ్రమరాంబికాదేవికి ఆలయంలో నవావరణ, త్రిశతి, ఖడ్గమాల, అష్టోత్తర శతనామ కుంకుమపూజ, జపపారాయణలను నిర్వహించారు. అచారాన్ని అనుసరించి ఈ పూజలన్ని అర్చకులు ఏకాంతంగా నిర్వహించారు. తరువాత అమ్మవారి ఆలయ ముందుభాగంలో రజకునిచేత ముగ్గు వేయించి శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి మొదటి విడత సాత్వికబలి ఇచ్చారు