దేవర భార్య గురించి తెలుసా?

దేవర భార్య గురించి తెలుసా? జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమాలో ఆయనకు భార్యగా ఎవరు నటిస్తున్నారో తెలుసా? ఆమె పేరు శ్రుతి మరాఠీ. ఈ బ్యూటీ నేటివ్‌ ప్లేస్‌ గుజరాత్‌. మోడల్‌గా గ్లామర్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు శ్రుతి. ఆ తర్వాత 2008లో మరాఠీ సినిమాతో నటిగా పరిచయమయ్యారు. అదే ఏడాది ఇందిర విళా అనే తమిళ్‌ సినిమాలోనూ నటించారు. ఆ సినిమాలో హేమ మాలిని అనే స్క్రీన్‌ నేమ్‌తో చేశారు శ్రుతి. ఆ తర్వాత కూడా తమిళ్‌, మరాఠీ, హిందీ, కన్నడ సినిమాల్లో ఆర్టిస్ట్ గా కంటిన్యూ అయ్యారు. తెలుగులో మాత్రం ఆమెకు ఇదే తొలి సినిమా. ఫస్ట్ సినిమాలోనే జూనియర్‌ ఎన్టీఆర్‌ భార్యగా నటించడం ఆనందంగా ఉందని అంటున్నారు శ్రుతి