ముత్యాల పరదాలు.. మెరిసిపోయే గ్రహాలు.. స్టార్ వార్స్ సినిమాలోని స్పేస్ క్రాఫ్ట్‌లో ఉన్న అనుభూతి.. ఇక రివాల్వింగ్ టన్నెల్లో తిరిగే బ్రిడ్జి. మరి అవతార్ మూవీలోని అవతార్ ట్రీ మీ కళ్ళ ముందు కనిపిస్తే.. ఎస్.. వింటేనే ఎంతో థ్రిల్‌గా ఉంది కదూ..! అయితే మీలాంటి వారి కోసమే మాయా వరల్డ్ ఆహ్వానం పలుకుతుంది. విశాఖలో టియు-142 యుద్ధ విమాన మ్యూజియం ప్రాంగణంలో మిరుమిట్లు గోలిపే విద్యుత్ కాంతుల్లో.. అద్దాలా గదుల్లో అద్భుతమైన మాయ ప్రపంచం కొలువుదిరింది. దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక కాన్సెప్ట్‌తో ఇది ఆకట్టుకుంటుంది.