తిరుపతి, తిరుమలలో ఎడతెరిపిలేని వర్షం..

దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు సరిహద్దు ప్రాంతాల్లో వర్ష ప్రభావం కనిపిస్తోంది. తిరుపతి, తిరుమలతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తుండటంతో జనజీవనంపై ప్రభావం పడుతోంది. తిరుమల కొండపై భారీ వర్షం కురుస్తుండటంతో శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కారణంగా బయట తిరగడం, దర్శనానికి సంబంధించిన పనులు, ఇతర అవసరాల కోసం కదలికలు సాగించడం భక్తులకు కొంత అసౌకర్యంగా మారింది. కొండపైకి వెళ్లే భక్తులు వర్షానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.