చిన్న మొత్తాల పొదుపుతోనూ పెద్ద లక్ష్యాలను చేరుకోవచ్చని నిరూపించాడో వ్యక్తి. రోజువారీ అవసరాల కోసం కూరగాయలు, నిత్యావసర సరుకులు కొనుగోలు చేసినప్పుడు మిగిలిన చిల్లరను వృథా చేయకుండా మూడేళ్లపాటు దాచుకున్నాడు. అలా పోగైన రూ.1.23 లక్షలతో ఏకంగా కొత్త బైక్‌ను కొనుగోలు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో ఈ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.