అలవోకగా వాగు దాటిన వృద్ధురాలు.. ఆమె వెనకే వెళ్లిన యువకుడు గల్లంతు!

హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మరోసారి వాన ముంచెత్తింది. దాంతో మూసి నదికి వరద పోటెత్తింది. దిగువన ఉన్న వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. యాదాద్రి జిల్లాలో మూసీ నది అనుబంధంగా ఉన్న వాగులు ఉదృతిగా ప్రవహిస్తుండడంతో లో లెవెల్ బ్రిడ్జిలపై వరద ఉదృతంగా ప్రవహిస్తుంది. ప్రయాణం ప్రమాదంగా మారింది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం గూడూరు వద్ద చిన్నేటి వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. రోడ్డుపై వరద ప్రవాహం పెరిగింది. ఓ 80 ఏళ్ల వృద్ధురాలు వరదను అంచనా వేసుకుంటూ.. వరద ఉదృతి తట్టుకుని వాగు ప్రవాహాన్ని దాటింది. కానీ ఓ యువకుడు మాత్రం దాటలేక ప్రవాహంలో కొట్టుకుపోయాడు.