శ్రీశైలం ప్రాంతాన్ని చిరుతపులులు వదలడం లేదు. ఏదో ఒకచోట కనిపిస్తూనే ఉన్నాయి. నిన్న మొన్నటివరకు శ్రీశైలం ఘాట్ రోడ్డులో చిరుతపులులు భక్తులకు కనిపించేవి. కానీ ఇప్పుడు ఏకంగా ఇళ్లల్లోకి గోడలు దూకి రావడంతో స్దానికులు వణికిపోతున్నారు. చిరుతపులి సమాచారం అటవీశాఖ అధికారులకు ఇచ్చారు. సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. రాత్రి వేళల్లో ఇంటి పరిసరాల్లోకి రావడం పట్ల భక్తులతో పాటు స్థానికల్లో కూడా భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. చిరుత కోసం గాలింపు మొదలుపెట్టిన ఫారెస్ట్ అధికారులు.. సున్నిపెంట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.