Watch: ఐఐటీ రూర్కీ మెస్‌లో షాకింగ్‌ సీన్.. ఆహారంపై వీర విహారం చేస్తున్న ఎలుకలు.. నెట్టింట దుమారం..

ఐఐటీ రూర్కీలోని హాస్టల్‌ మెస్‌ కిచెన్‌లోని ఆహారంపై ఎలుకలు తిరుగడాన్ని విద్యార్థులు గమనించారు. దీనిని వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో వైరల్ అయ్యింది. గురువారం మధ్యాహ్నం భోజనం కోసం క్యాంపస్‌లోని రాధా-కృష్ణా భవన్ మెస్‌కు కొందరు విద్యార్థులు వెళ్లారు. హాస్టల్ వంట గదిలోని కుక్కర్‌తోపాటు పలు పాత్రల్లో ఎలుకలు ఉండటాన్ని చూశారు.