200 ఏళ్ల నాటి అరుదైన శంఖం... ఏడాది ఒక్కసారి మాత్రమే భక్తులకు దర్శనం

మంగళగిరి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ది చెందింది. ప్రముఖ వైష్ణవాలయంగా వెలుగొందుతుంది. ఇక్కడి ఆలయ గోపురం, ముఖ మండపం, కోనేరులకు ఎంతో చారిత్రక నేపధ్యం ఉంది. నాలుగు వందల ఏళ్ల క్రితమే ముఖ మండపం నిర్మించగా రెండు వందల ఏళ్ళ క్రితం గాలి గోపురాన్ని నిర్మించారు. ఇవే కాదు.. ఈ ఆలయంలో రెండు వందల ఏళ్ల నాటి ఎంతో ప్రసిద్ధి చెందిన శంఖం కూడా ఉంది. భక్తులు దాన్ని చూడాలంటే.. ఏడాదిపాటు వేచి చూడాల్సి ఉంటుంది.