ఎన్నో వేలాలు జరుగుతుంటాయి. కానీ కోర్టులోనే వేలం పాట జరగడం ఎపుడైనా చూశారా..? కనీసం విన్నారా.. కానీ ఓ వ్యక్తి కోర్టులో ఓ పందెం కోడిని దక్కించుకున్నాడు ఓ ఘనుడు..! అనుమతి లేకుండా కోడి పందెంలు నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు, జనవరి 25వ తేదీన అత్తాపూర్‌లోని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపర్చారు. నిందితులతో పాటు పందెం కోడిని సైతం పోలీసులు కోర్టులో ప్రవేశ పెట్టారు. అయితే నిందితులకు జరిమానా విధించడంతో పాటు కోడిని ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు న్యాయమూర్తి.