పొలాలను కాపాడుకునేందుకు రైతుల వినూత్న ప్రయోగం..! వ్యవసాయ బావులు, పొలాల వద్ద బోరు మోటార్లను, వైర్ల దొంగతనాలు పెరుగుతున్నాయి. ఇలా ఎత్తుకెళ్లి రైతులను ఇబ్బందులకు గురుచేస్తున్న దొంగల బెడద నుండి బయట పడేందుకువినూత్న ఆలోచన చేశారు సిద్దిపేట జిల్లాకు చెందిన రైతులు. రైతులందరూ కలిసి డబ్బులు పోగుచేసి, దొంగలను పట్టుకునేందుకు సోలార్ సిస్టంతో మూడో కన్ను వ్యవసాయ పొలాల వద్ద ఏర్పాటు చేసుకున్నరు. అవి నిరంతరం కాపలా కాసేలాగా ఏర్పాట్లు చేసుకున్న రు.