సాధారణంగా లాకప్‌లో నేరస్థులు ఉంటారు. కానీ ఒక పోలీస్ అధికారి, అది కూడా యూనిఫామ్‌లో ఉన్నప్పుడు, లాకప్‌లో ఉండడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. హర్యానాలోని కైథల్ జిల్లా కోర్టులో ఓ హత్య కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసులో సాక్ష్యం చెప్పడానికి ఇన్‌స్పెక్టర్ రాజేష్ కుమార్ కోర్టుకు హాజరు కావాలి. ఆయన అరగంట ఆలస్యంగా రావడంతో జడ్జి ఆయన్ని లాకప్ వేశారు.