భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్రంలో ఈ ప్రక్రియను చేపట్టారు.. చర్ల మండలానికి చెందిన ఆవుల శివప్రసాద్ అనే వ్యక్తి ఈ టెక్నాలజీ గురించి తెలుసుకొని తమ పాత భవనానికి సైతం ఇదే టెక్నాలజీని వాడి సుమారు నాలుగు అడుగులు ఎత్తును పెంచారు..అన్ని పిల్లర్లకు జాకీలను ఫీట్ చేసి పెట్టి భవనం ఎత్తును పెంచి ఆ మధ్యలో గ్యాప్ ను ఐరన్ ద్వారా పూర్తి చేస్తున్నారు.. ఇప్పుడు ఈ బిల్డింగ్ ఎత్తు సుమారు నాలుగు అడుగులు పైన పెరిగింది.