గోదావరి ఒడ్డున తిష్టవేసిన బెబ్బులి.. కారణాలేంటి..?

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కొద్దిరోజుల క్రితం కలకలం సృష్టించిన పెద్దపులి తాజాగా ములుగు జిల్లాలో ప్రత్యక్షమైంది. వెంకటాపురం మండలంలోని భోదపురం, ఆలుబాక, తిప్పాపురం, సీతారాంపురం, రామచంద్రపురం గ్రామ పరిసరాల్లో పులి గాండ్రింపులు విన్న స్థానికులు హడలెత్తిపోతున్నారు. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన అటవీ శాఖ అధికారులు పులి కదలికలు పసిగట్టారు. పాదముద్రల ఆధారంగా గోదావరి పరివాహక ప్రాంతంలో పెద్దపులి సంచరిస్తున్నట్లుగా గుర్తించారు.